AP: మంత్రి నారా లోకేష్‌తో పద్మశ్రీ శోభారాజు మర్యాదపూర్వక భేటీ

AP: ఉండవల్లిలోని మంత్రి నివాసంలో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌తో పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభారాజు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

Update: 2026-08-04 15:13 GMT

AP: మంత్రి నారా లోకేష్‌తో పద్మశ్రీ శోభారాజు మర్యాదపూర్వక భేటీ

AP: ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభారాజు మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలుగు భక్తి సంగీత సంప్రదాయం, సనాతన ధర్మ ప్రచారం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ వంటి అంశాలపై వారు చర్చించారు.

సమావేశంలో భాగంగా శోభారాజు మంత్రి లోకేష్‌కు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. అనంతరం మంత్రి లోకేష్ శ్రీవారి ప్రతిమను బహుకరించి శోభారాజును ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా శోభారాజు దశాబ్దాలుగా అన్నమయ్య సంకీర్తనలను దేశ విదేశాల్లో ఆలపిస్తూ తెలుగు భక్తి సాహిత్య వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్న సేవలను మంత్రి లోకేష్ కొనియాడారు. తెలుగు సంస్కృతి, భారతీయ ఆధ్యాత్మిక విలువలు, సనాతన ధర్మ ప్రచారానికి ఆమె అందిస్తున్న విశిష్ట సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

అన్నమయ్య కీర్తనల ద్వారా యువతలో ఆధ్యాత్మిక చైతన్యం, సాంస్కృతిక అవగాహన పెంపొందించడంలో శోభారాజు చేస్తున్న కృషి ప్రశంసనీయమని మంత్రి అభినందించారు. ఈ మర్యాదపూర్వక భేటీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువల పరిరక్షణకు ప్రభుత్వం, కళాకారుల మధ్య సమన్వయానికి ప్రతీకగా నిలిచింది.

Tags:    

Similar News