Amaravati: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్!
Amaravati: ఏపీ మద్యం రవాణా స్కాంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును అరెస్ట్ చేసిన ఈడీ. రూ. 195 కోట్ల ఖజానా నష్టం, రూ. 37.7 కోట్ల ఆస్తులు జప్తు.
Amaravati: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్!
Amaravati: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మద్యం రవాణా వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు 195 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు గుర్తించారు.
మద్యం రవాణా సిండికేట్‌తో కారుమూరి, ఆయన కుమారుడికి లింకులు ఉన్నట్లు నిర్ధారించారు. సుదర్శన్ కన్ట్రక్షన్ ద్వారా లిక్కర్ రవాణా కార్యకలాపాలు నిధుల నిర్వహణలో సునీల్ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు.
ముడుపుల డబ్బులతో కారుమూరి కుటుంబం ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కారుమూరి కుటుంబానికి చెందిన 37.7 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే జప్తుచేశారు. నేడు నాంపల్లి కోర్టులో కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు హాజరుపర్చనున్నారు.