AP: ప్రైవేట్ స్కూళ్లలో 25% ఉచిత సీట్లు: ఏపీ కీలక నిర్ణయం!

AP: ప్రైవేట్ స్కూళ్లలో విద్యాహక్కు చట్టం కింద 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపు, అడ్మిషన్ల ప్రక్రియ అధ్యయనానికి ప్రభుత్వం 16 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

Update: 2026-09-03 11:01 GMT

AP: ప్రైవేట్ స్కూళ్లలో 25% ఉచిత సీట్లు: ఏపీ కీలక నిర్ణయం!

AP: విద్యాహక్కు చట్టం అమలుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఉచిత ప్రవేశాల అమలుపై సమగ్ర అధ్యయనం చేసేందుకు 16 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఛైర్‌పర్సన్‌గా.. సమగ్ర శిక్షా ఎస్పీడీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.. ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ఎలా ఉండాలి.. విద్యార్థుల ఎంపికలో పారదర్శకత ఎలా తీసుకురావాలి.. పేద విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానం ఎలా ఉండాలి.. అనే అంశాలపై కమిటీ లోతుగా అధ్యయనం చేయనుంది.

విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద, బలహీన వర్గాల పిల్లలకు ఉచితంగా కేటాయించాల్సి ఉంటుంది.. అయితే ఈ విధానం అమలులో ఎదురవుతున్న సమస్యలు.. అడ్మిషన్ల ప్రక్రియలో పారదర్శకత.. పాఠశాలల ఎంపిక.. ఫీజుల రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత అవసరమైన నిబంధనలను సవరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

సుప్రీంకోర్టు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఆదేశాలకు అనుగుణంగా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ముఖ్యంగా ఆన్‌లైన్ విధానంలో అడ్మిషన్ల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించడంపై కమిటీ దృష్టి పెట్టనుంది.. అర్హులైన విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేలా విధానం రూపొందించనుంది.

కమిటీలో తల్లిదండ్రుల ప్రతినిధులు, ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలకు కూడా ప్రాతినిధ్యం కల్పించారు.. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని విధానాన్ని రూపొందించే అవకాశం ఉంది.. పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందేలా.. ఎలాంటి వివక్షకు తావులేకుండా చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.. కమిటీ అధ్యయనం అనంతరం సమగ్ర నివేదిక సమర్పించనుండగా.. దాని ఆధారంగా విద్యాహక్కు చట్టం అమలులో మరిన్ని మార్పులు, సంస్కరణలు తీసుకురానుంది.

Tags:    

Similar News