Amaravati: సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు 'ఎస్‌' మలుపు ప్రచారాలు నమ్మవద్దు!

Amaravati: అమరావతి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు 'ఎస్‌' మలుపుపై దుష్ప్రచారం వలదు; భవిష్యత్ అవసరాలు, ఎలివేటెడ్ కారిడార్ ప్రణాళికల అనుసారమే డిజైన్.

Update: 2026-08-13 06:58 GMT

Amaravati: సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు 'ఎస్‌' మలుపు ప్రచారాలు నమ్మవద్దు!

Amaravati: అమరావతి సీడ్‌ యాక్సెస్‌ రహదారిలో ఎస్‌ ఆకారపు మలుపుపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ మలుపు ఎందుకు వచ్చిందో తెలియకుండా రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఈ రహదారిని డిజైన్‌ చేశాం.

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు మూడో దశలో విజయవాడ–చెన్నై జాతీయ రహదారికి కనెక్ట్‌ అవుతుంది. మణిపాల్‌ ఆస్పత్రి దగ్గర జాతీయ రహదారితో అనుసంధానం చేసేలా ప్రణాళికలు ఉన్నాయి. భవిష్యత్‌లో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించడానికి కూడా అనువుగా ప్రస్తుత రహదారిని నిర్మిస్తున్నాం.

దొండపాడు నుంచి తాడేపల్లి వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించాలన్న ప్రతిపాదన 2017లోనే ఉంది. అప్పటి ప్రణాళిక ప్రకారమే ఇప్పుడు కూడా రహదారి నిర్మాణం జరుగుతోంది. కాబట్టి ఎస్‌ ఆకారపు మలుపును చూపించి రహదారి నిర్మాణంలో ఏదో తప్పు జరిగిందని ప్రచారం చేయడం సరికాదు.

ఇప్పటికే స్టీల్‌ బ్రిడ్జిలు, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు అందుబాటులోకి రావడంతో అమరావతికి మంగళగిరి, విజయవాడతో కనెక్టివిటీ మరింత పెరిగింది. కృష్ణా కరకట్టపై కూడా ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గుతుంది.

అమరావతిని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేలా దీర్ఘకాలిక ప్రణాళికతో ఈ రహదారిని నిర్మిస్తున్నాం. ప్రజలు దుష్ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవాలను గమనించాలని కోరుతున్నానన్నారు.

Tags:    

Similar News