Chennur: చెన్నూర్ శివాలయంలో శ్రావణ సోమవారం, నాగుల పంచమి పూజలు
Chennur: శ్రావణ మాస తొలి సోమవారం, నాగుల పంచమి ఒకే రోజు రావడంతో మంచిర్యాల జిల్లా చెన్నూర్ శివాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. పుట్టల వద్ద ప్రత్యేక పూజలు.
Chennur: చెన్నూర్ శివాలయంలో శ్రావణ సోమవారం, నాగుల పంచమి పూజలు
Chennur: చెన్నూరు పట్టణంలోని ఎంతో ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ శివాలయం ఆవరణలో శ్రావణ సోమవారం అందులోనూ నాగుల పంచమి ఒకే రోజు రావడంతో ఆధ్యాత్మిక శోభ విరాజిల్లింది.
ఉదయం నుంచే మహిళా భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి నాగదేవతల పుట్టల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.నాగ దేవతల పుట్టలో పాలు పోసి, ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి, పసుపు, కుంకుమలు సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.
తమ కుటుంబ అందరికీ ఆ నాగదేవతలు ఎల్లప్పుడూ అండగా ఉండి ఎలాంటి ఆపద రాకుండా చూడాలని అలాగే ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో, సంతోషంగా ఉంటూ సుభిక్షంగా ఉండాలని నాగదేవతను ప్రార్థించారు.
శ్రావణ సోమవారంతో పాటు నాగుల పంచమి తిథి కూడా ఒకే సారి కలసి రావడంతో శివాలయ ప్రాంగణం శివనామస్మరణ, నాగదేవత పూజలతో మార్మోగింది.
ప్రతి ఏటా శ్రావణమాసంలో వచ్చే నాగుల పంచమి రోజుకు ఎంతో విశిష్టత అవుతుంది. అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే తొలి సోమవారం కావడం నాగుల పంచమి రెండు కూడా ఒకేరోజు కలిసి రావడంతో శివాలయాలలో భక్తులు పోటెత్తారు.