Adilabad: ఇస్లాంపురలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్129 వాహనాలు సీజ్

Adilabad: ఇచ్చోడ మండలం ఇస్లాంపురలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్. పత్రాలు లేని 129 వాహనాలు సీజ్, ఏఎస్పీ రుత్వీక్ సాయి కొట్టే హెచ్చరిక.

Update: 2026-08-20 07:39 GMT

Adilabad: ఇస్లాంపురలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్129 వాహనాలు సీజ్

Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ఇస్లాంపుర గ్రామంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పోలీసులు తెల్లవారుజామున విస్తృతంగా 'కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్' నిర్వహించారు. ఉట్నూర్ ఏఎస్పీ రుత్వీక్ సాయి కొట్టే ఆధ్వర్యంలో సుమారు 150 మంది సిబ్బంది చేపట్టిన తనిఖీలలో సరైన పత్రాలు లేని 110 ద్విచక్ర వాహనాలు, 4 కార్లు, ఒక ఆటోతో పాటు నంబర్ ప్లేట్ లేని, ఫేక్ నంబర్ ప్లేట్లు ఉన్న 15 బైకులను స్వాధీనం చేసుకున్నారు.

జిల్లాలో గంజాయి విక్రయాలు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, మట్కా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ హెచ్చరించారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News