Nirmal: సీఎం సందేశంతో ‘ప్రజా పాలన’ ప్రణాళికలు షురూ
Nirmal: నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో ‘ప్రజా పాలన – పట్టణ ప్రణాళిక’ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
Nirmal: సీఎం సందేశంతో ‘ప్రజా పాలన’ ప్రణాళికలు షురూ
నిర్మల్: కలెక్టరేట్లో 99ప్రజా పాలన-పట్టణ ప్రణాళిక నిర్మల్ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అంతకుముందు సీఎం సందేశాన్ని కలెక్టర్ చదివి వినిపించారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తుందన్నారు . ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన సంక్షేమ పథకాలు, రాబోయే రోజుల్లో చేపట్టబోయే సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి ఈ కార్యక్రమంలో తెలపడం జరుగుతుందన్నారు. గ్రామస్థాయి నుంచి మొదలుకొని మండలస్థాయి, జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్క అధికారి కమిట్మెంట్తో ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.