Adilabad: బీహార్ సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ

Adilabad: బీహార్ కేంద్రంగా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడి.

Update: 2026-08-21 10:42 GMT

Adilabad: బీహార్ సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ

Adilabad: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు చేస్తూ బీహార్ రాష్ట్రంలో తలదాచుకుంటూ అతి సామాన్యులుగా జీవిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్లల్లో మోసాలు చేసిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు.. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలను వెల్లడించారు. నిందితులపై దేశవ్యాప్తంగా 500 నేరాలు పాల్పడినట్లు దాదాపు 3.5 కోట్ల వరకు ప్రజల వద్ద మోసం చేసి డబ్బులను కాజేసినట్లు తెలిపారు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 90 సైబర్ క్రైమ్ నేరాలలో ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.

ఒక నకిలీ ఫర్టిలైజర్ ఫ్రాంచైజీ ఇచ్చే వెబ్సైట్ను ఓపెన్ చేసి దేశవ్యాప్తంగా నకిలీ వెబ్సైట్ నందు అప్లికేషన్ ద్వారా బాధితుల వివరాలను, వారి ఆధార్ పాన్, కార్డులు,బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి విడతలవారీగా బాధితుల వద్ద వివిధ రకాల ఫీజులు సర్వీస్ ఫీజు, లైసెన్సు ఫీజు, ట్రేడ్ ట్రాన్స్ఫర్ ఫీజు అంటూ లక్షల్లో వసూలు చేసి మోసం చేస్తున్నట్టు తెలిపారు.అదేవిధంగా బజాజ్ లోన్ అంటూ నిందితులు, లోన్ కోసం ఆన్లైన్ నందు వెతికే బాధితుల వద్ద నుండి అప్లికేషన్ ద్వారా వారి వివరాలను సేకరించి ఆధార్ కార్డు, పాన్ కార్డు ద్వారా వివిధ రకాల ఫీజులు వసూలు చేస్తూ లక్షల్లో వసూలు చేస్తూ, వందల మంది బాధితులకు మోసం చేయడం జరిగిందని తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యక్తిని “నేషనల్ ఫర్టీలైజర్ ప్రైవేట్ లిమిటేడ్ పేరుతో నకిలీ ప్రకటన ద్వారా ఫ్రాంచైజీ ఇప్పిస్తామని నమ్మించి రూ.3,85,725/- మోసం చేశారని. ఈ కేసు లో నిందితులను గుర్తించి, ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బీహార్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశామన్నారు..నిందితుల వద్ద నుండి పది మొబైల్ ఫోన్లను మరియు 70000 నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని, నిందితులు బాధితుల వద్ద నుండి మోసం చేసి వసూలు చేసిన డబ్బులలో 8 లక్షల రూపాయలను బ్యాంకు ఖాతాలలో, స్టాక్ మార్కెట్ షేర్లలో ఇన్వెస్ట్ చేసినట్లు వాటిని జప్తు చేయడం జరిగిందని తెలిపారు.

Tags:    

Similar News