Nirmal: బాసర ఆలయం చోరీ కేసు ఛేద్యం ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
Nirmal: బాసర సరస్వతి అమ్మవారి వెండి కిరీటం దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు. కిలోన్నర పైగా వెండి రికవరీ.. వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి షర్మిల.
Nirmal: బాసర ఆలయం చోరీ కేసు ఛేద్యం ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
Nirmal: బాసర ఆలయంలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు.జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఇందుకోసం 6 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నూతన టెక్నాలజీతో పది రోజుల్లోనే దొంగలను పట్టుకున్నామన్నారు.
కిరీటం అమ్మడం కోసం రైలులో నాందేడ్ కు వెళ్తుండగా బాసర వద్ద అదుపులోకి తీసుకునామన్నారు. ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగల తో పాటు మరొక వ్యక్తి అరెస్టు చేసినట్లు తెలిపారు.
పల్లపు ఏడుకొండలు, గైని రామకృష్ణ, కొడమ ఆనంద్ గా గుర్తించారు. వీరి వద్ద నుంచి 1.220 కిలోల వెండి కిరీటం, 260 రాముల వెండి పట్టి, 1 మొబైల్ ఫోన్ స్వాధీనం పరుచుకున్నామన్నారు. కాగా ఈ నిందితులు పాత నేరస్తులుగా ఉన్నారన్నారు. రైల్వే సౌకర్యం ఉన్న ఆలయాలలో చోరీ చేయడం వీరి ప్రత్యేకతన్నారు. చోరీ ని వేగంగా చేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.