Adilabad: ఆదిలాబాద్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం కలెక్టర్, ఎస్పీలు యాక్టివ్ మోడ్‌లోకి వచ్చారు.

Update: 2026-06-24 07:46 GMT

Adilabad: ఆదిలాబాద్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!

Adilabad: అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రాజర్సీ షా ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు స్వయంగా రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించారు.

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు, అన్ని రకాల వైద్య సేవలు అందించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం డాక్టర్లతోపాటు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రికార్డుల మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని, రోగులకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు కలెక్టర్.

యాంటీ డ్రగ్స్ వీక్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ లోని వన్ టౌన్ వద్ద ఏర్పాటుచేసిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుతామని కొటేషన్స్ రాశారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

Tags:    

Similar News