పోలీసులపై యువ మోర్చ జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఫైర్‌

పోలీసులపై యువ మోర్చ జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఫైర్‌

Update: 2020-11-24 13:45 GMT

Tejasvi Surya (file image)

ఓయూలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహణతో ఉద్రిక్తత ఏర్పడింది. ఓయూలో రాజకీయ సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, బీజేవైఎం కార్యకర్తలు బారికేడ్లను తొలగించి ఆర్ట్స్ కళాశాల వద్దకు చేరుకున్నారు. అమరవీరులకు నివాళులు అర్పించేదుకు వస్తే పోలీసులు అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని యువ మోర్చ జాతీయ అధ్యక్షుడు ఎంపీ తేజస్వి సూర్య ప్రశ్నించారు. పోలీసులు కేసీఆర్‌ కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందని విమర్శించారు. తెలంగాణలో యువత ఇంకా నిరుద్యోగులుగానే మిగిలిపోయారన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారని తెలిపారు.

Tags:    

Similar News