Suicide: చదువు అర్ధం కాలేదని యువతి ఆత్మహత్య

Suicide: ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య

Update: 2023-01-23 05:40 GMT

Suicide: చదువు అర్ధం కాలేదని యువతి ఆత్మహత్య

Suicide: కామారెడ్డి జిల్లా వేల్ఫుగొండలో దారుణం చోటు చేసుకుంది. చదువు అర్ధం కావడం లేదంటూ ఓ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సదాశివ నగర్ మండలం మర్కల్‌లోని గురుకుల డిగ్రీ కళాశాలతో యువతి మొదటి సంవత్సరం చదువుతోంది. సంక్రాంతి సెలవులకు యువతి..తన స్వగ్రామైన వేల్ఫుగొండకు వచ్చింది. సెలవులు అయిపోవడంతో యువతికి కళాశాలకు వెళ్లాలని తల్లిదండ్రులు సూచించారు. దీంతో యువతి తనకు చదువు అర్ధం కాలేదు అని చెప్పినట్లు సమచారం. యువతిని తల్లిదండ్రులు సముదాయించి కళాశాలకు పంపండానికి సిద్ధమయ్యారు. కాగా తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News