గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి! ది హాన్స్ ఇండియా హాఫ్ మారథాన్ విజయవంతం

వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం హెచ్ ఎం టీవీ సహకారంతో ది హాన్స్ ఇండియా ఆంగ్ల దినపత్రిక హాఫ్ మారథాన్ పరుగునును హైదరాబాద్ సంజీవయ్య పార్క్ నుంచి ప్రారంభించింది.

Update: 2019-09-29 04:31 GMT

వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హెచ్ ఎం టీవీ సహకారంతో ది హాన్స్ ఇండియా ఆంగ్ల దిన పత్రిక ''హన్స్ హాఫ్ మారధాన్'' పరుగును ఆదివారం ఉదయం సంజీవయ్య పార్క్ నుంచి నిర్వహించింది. గుండెకు సంబంధించిన జబ్బుల పై అవగాహన కల్పించడం.. ఆరోగ్యవంతమైన గుండె కోసం ఎటువంటి జీవన శైలిని అనుసరించాలనే దానిపై ప్రజలను చైతన్యవంతులను చేయడం కోసం ఈ మినీ మారథాన్ నిర్వహించినట్లు హన్స్ ఇండియా తెలిపింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, అడిషనల్ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు, ప్రముఖ కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ పాల్గొని మారథాన్ లో పాల్గొన్న సుమారు వేయిమందికి ఉత్సాహాన్నిచ్చారు.

ఈ సందర్భంగా వారు ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కార్యక్రమాలను నిర్వహిస్తూ వారిలో చైతన్యం కలిగిస్తున్నందుకు హెచ్ ఎం టీవీ, ది హాన్స్ ఇండియా లను అభినందించారు. ప్రపంచంలో గుండె జబ్బులతో బాధపడుతున్నవారిలో 60 శాతం భారతదేశం నుంచే ఉన్నట్టు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. గుండె జబ్బు ఒక్క వ్యాది బారిన పడిన వారినే వేధించే సమస్య కాదని.. ఆ వ్యక్తితో పాటు మొత్తం కుటుంబం అంతా దాని పరిణామాలను అనుభవించే పరిస్థితి ఉంటుందనీ చెప్పారు. గుండె జబ్బుల పట్ల అవగాహన కలిగి, చైతన్యవంతమై ఆరోగ్యకరమైన జీవన అలవాట్లతో గుండెకు సంబంధించిన జబ్బులను నివారించవచ్చని పేర్కొన్నారు. ఆ చైతన్యం కల్పించడం కోసమే ప్రపంచ గుండె జబ్బుల దినోత్సవం సందర్భంగా హాఫ్ మారథాన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.



Tags:    

Similar News