Karimnagar: అధికారులకు షాక్ ఇచ్చిన అఫ్రైజర్‌..అదేంటో తెలుసా?

ఎవరైనా అవసరానికి డబ్బు కావాలంటే ఏం చేస్తారు. ఎవరినైనా అప్పు అడుగుతారు.

Update: 2020-01-22 04:40 GMT

ఎవరైనా అవసరానికి డబ్బు కావాలంటే ఏం చేస్తారు. ఎవరినైనా అప్పు అడుగుతారు. వారు ఇవ్వకపోతే తమ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులనో లేదా బంగారాన్నో తాకట్టు పెట్టి డబ్బులను తీసుకుంటారు. అదే తరహాలో ఓ వ్యక్తి కూడా స్వయంగా తాను పనిచేసే సహకార సంఘంలోనే బంగారాన్ని తాకట్టుపెట్టి డబ్బులను తీసుకున్నాడు. తరువాత నాలుగేండ్ల పాటు బకాయిని చెల్లించకపోవడంతో రంగంలోకి దిగిన అధికారులు అతను తీసుకున్న అప్పు వివరాలను పరిశీలించారు. సంఘంలో పని చేసే వాళ్లకి అప్పు ఎలా ఇస్తారని బ్యాంకు సిబ్బందిని నిలదీసారు. పోనీ అతను తాకట్టు పెట్టిన బంగారం జప్తు చేద్దామని పరిశీలించగా అతను పెట్టింది నకిలీ బంగారం అని తేలింది. దీంతో ఖంగుతిన్న అధికారులు అతన్ని పిలిపించి నిలదీసారు.

పూర్తి వివరాల్లోకెళ్తే కరీంనగర్‌ మండలం దుర్శేడ్‌ సహకార సంఘంలో శ్రీరామోజు కృష్ణమాచారి కొన్నేళ్లనుంచి అఫ్రైజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి డబ్బులు అవసరం ఉండడంతో 2015లో సంఘంలో బంగారు నగలను తాకట్టు పెట్టి రూ.44వేలు, 2016లో రూ.95 వేలు రుణం తీసుకున్నాడు. తరువాత కృష్ణమాచారి బకాయిని చెల్లించకపోవడంతో బ్యాంకు నుంచి అతనికి పలుమార్లు నోటీస్‌లు జారీ చేశారు. అయినప్పటికీ కట్టక పోగా మార్చి నెలాఖరులోపు మొండి బకాయిలను వసూలు చేయాలని అధికారులు కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఖార్ఖనగడ్డ కేడీసీసీ బ్రాంచ్‌ మేనేజరు లావణ్య సంఘాన్ని సందర్శించి రుణాల జాబితాను పరిశీలించారు.

తరువాత అఫ్రైజర్‌ తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను పరిశీలించగా నకిలీగా తేలడంతో కృష్ణమచారిని కార్యాలయంలోకి పిలిపించి విచారణ జరిపించారు. తక్షణమే రుణం చెల్లించకపోతే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మంగళవారం బ్యాంకు సిబ్బంది కృష్ణమాచారికి సంబంధించిన అసలు బంగారాన్ని కరీంనగర్‌లోని ఖార్ఖనగడ్డ బ్రాంచ్‌లో తాకట్టుపెట్టింటి రుణం ఇప్పించి సంఘం చెల్లించాల్సిన రూ. 2.40లక్షలను వసూలు చేసారు. బంగారం తాకట్టు పెట్టుకుని అఫ్రైజర్‌కు రుణం ఇవ్వరాదనే విషయం తెలియక అతనికి ఇచ్చామని, నకిలీ బంగారం కాదని, నగల్లో నాణ్యత లేదని సంఘం సీఈవో ఆంజనేయులు తెలిపారు. 



Tags:    

Similar News