హైదరాబాద్ బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఓ యువతి వీరంగం సృష్టించింది. తన ప్రియుడిని తీసుకురావాలని లేదంటే పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడింది. చిత్రపురి కాలనీకి చెందిన ఓ యువతి (22)కి మాదాపూర్‌లోని ఓ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న పెళ్లయిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా సదరు వ్యక్తి యువతికి కన్ఫించకుండా పోయాడు. దీంతో బాచుపల్లి రాజీవ్‌గాంధీ నగర్లో నివాసముండే ప్రియుడి ఇంటికి బుధవారం రాత్రి వచ్చింది.
ఆ సమయంలో అతడి తల్లిదండ్రులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. తనకు వివాహం జరిపించాలంటూ వారితో వాదనకు దిగింది. దీంతో వారు బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సదరు యువతితో పాటుగా ఆ అబ్బాయి తల్లిదండ్రులకు పీఎస్‌కు తీసుకోచ్చి విచారించారు. ఈ క్రమంలో సదరు యువతి పీఎస్‌లో హల్చల్ చేసింది. పోలీసులు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుడా అరుస్తూ. తన బాయ్‌ఫ్రెండ్‌ను తెచ్చివ్వాలంటూ డిమాండ్ చేసింది. తలను గోడకు బాదుకుని ఏడ్చింది. చివరకు అతన్ని పోలీస్ స్టేషన్‌కు రప్పిస్తామని చెప్పడంతో ఆమె శాంతించింది.