Rangareddy: పట్టాలపైకి దూసుకొచ్చిన కారు.. యువతి చేసిన పనికి అంతా షాక్..!

Rangareddy: రంగారెడ్డి జిల్లాలో ఓ యువతి చేసిన నిర్వాకం తీవ్ర కలకలం రేపింది.

Update: 2025-06-26 05:30 GMT

Rangareddy: పట్టాలపైకి దూసుకొచ్చిన కారు.. యువతి చేసిన పనికి అంతా షాక్..!

Rangareddy: రంగారెడ్డి జిల్లాలో ఓ యువతి చేసిన నిర్వాకం తీవ్ర కలకలం రేపింది. నాగులపల్లి-శంకర్‌పల్లి రైల్వే మార్గంలో యువతి ఓ కారును సుమారు 7 కిలోమీటర్ల మేర రైలు పట్టాలపై నడిపిస్తూ హల్‌చల్ చేసింది. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు రెండు గంటల పాటు అంతరాయం ఏర్పడింది.

ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం, లోకోపైలట్‌ దూరంలో వస్తున్న ట్రైన్‌ను గమనించి సమయస్పూర్తితో ఆపేశారు. స్థానికులు, రైల్వే సిబ్బంది, పోలీసులు కలిసి అతికష్టంగా యువతిని అదుపులోకి తీసుకున్నారు. కారును ఆపే ప్రయత్నంలో ఆమె చాకుతో బెదిరించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

పట్టాలపై కారు నడిపిన యువతిని లఖ్‌నవూకి చెందిన రవికా సోనీగా గుర్తించారు. ఆమె హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తూ ఇటీవల ఉద్యోగం కోల్పోయినట్లు తెలుస్తోంది. రీల్స్‌ కోసం ఈ పనికి తెగబడినట్లు ప్రాథమికంగా సమాచారం.

ఈ నేపథ్యంలో రవికా మానసిక స్థితి నిలకడగా లేదో? డ్రగ్స్‌ తీసుకున్నదేమో? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం కోసం అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Tags:    

Similar News