Aadi Srinivas: ఏకంగా ఎమ్మెల్యేనే బురిడి కొట్టించాలని చూశారు.. విదేశాలకు పంపిస్తామంటూ
Aadi Srinivas: విదేశాలకు పంపిస్తామంటూ ప్రజల నుంచి డబ్బులు వసూలూ చేస్తున్న ట్రావెల్స్ దందా జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది.
Aadi Srinivas: విదేశాలకు పంపిస్తామంటూ ప్రజల నుంచి డబ్బులు వసూలూ చేస్తున్న ట్రావెల్స్ దందా జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. తాజాగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఓ మహిళ ఫోన్ చేసి విదేశాలకు పంపిస్తామంటూ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ మహిళను నిలదీశారు. ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగింది.
మహిళ పోన్ కాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంబిగద్దె ప్రాంతంలోని ట్రావెల్స్ ఆఫీసు నుంచి ఫోన్ చేసినట్టు గుర్తించిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గల్ప్ పంపిస్తామంటూ కొంత కాలంగా ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నట్లుగా బయటపడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.