తెలంగాణలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు..

Update: 2020-06-20 09:45 GMT

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని.. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో అక్కడక్కడ భారీ వర్షాలకు కూడా అవకాశం ఉందని.. ఐఎండీ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరత్నం తెలిపారు.

తొలకరి చినుకులు కురవడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిస్తున్నది. తొలకరి పులకరింపుతో రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించారు.. విత్తనాలు వేస్తూ వానకాలం పంటల సాగును ప్రారంభించారు.. మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని తెలియడంతో రైతన్నలు జోరుగా పనులు ప్రారంభిస్తున్నారు.


Tags:    

Similar News