రానున్న 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు

Update: 2019-04-19 02:37 GMT

రానున్న మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. (గంటకు 40 నుంచి 50 కి.మీ) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. మరఠ్వాడా నుంచి కోమోరిన్‌ ప్రాంతం వరకు ఇంటీరియర్‌ తమిళనాడు ,

ఇంటీరియర్‌ కర్ణాటక, మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలావుంటే రాష్ట్రంలో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. 

Similar News