KCR: వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తాం.. బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్‌ వ్యాఖ్యలు

KCR: రెండు గంటలుగా బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుకు హరీశ్ రావును ఇంఛార్జీగా నియమించినట్లు సమాచారం.

Update: 2025-02-19 11:51 GMT

KCR: వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తాం.. బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్‌ వ్యాఖ్యలు

KCR: రెండు గంటలుగా బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుకు హరీశ్ రావును ఇంఛార్జీగా నియమించినట్లు సమాచారం. మహిళ కమిటీలు సైతం వేయాలని బీఆర్ఎస్ అధినేత సూచించారు. సంవత్సరం పొడువునా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఏప్రిల్ 10న డెలిగేట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలు కొందరిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అనవసర కామెంట్లు చేశారని ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని.. ప్రజల కోసం పోరాటం చేయాలని శ్రేణులకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు బీఆర్‌ఎస్‌కు మాత్రమే తెలుసునన్నారు. వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ కాంగ్రెస్‌ పాలనలో మళ్లీ వెనక్కి వెళ్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News