ఆరోగ్యశ్రీలో కిడ్నీ ప్యాకేజీల పెంపును పరిశీలిస్తాం : ఈటల

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారిలో ఎవరికైనా గుండె సంబంధిత జబ్బులు కానీ, లేదా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుంటుందని తెలిపారు.

Update: 2019-11-10 10:05 GMT

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ నగరంలో జెనిటో యూరినరీ సర్జన్స్‌ వార్షిక సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి గవర్నర్‌ తమిళిసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ వైద్య రంగంలో వైద్యులు సరిగ్గా పనిచేయకపోతే ఆస్పత్రికి వచ్చిన రోగులకు నష్టం కలుగుతుందని, భారీ కట్టడాలు నిర్మాణాలు చేసే ఇంజనీర్ సరైన నాణ్యతను పాటించకపోతే కొంతమంది నష్టపోతారని అదే విధంగా సరైన రాజకీయ నాయకులు లేకపోతే సమాజమే నష్టపోతుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

ఆరోగ్య ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం ప్రతి ఏటా రూ.900 కోట్లు ఖర్చు పెడుతుందన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారిలో ఎవరికైనా గుండె సంబంధిత జబ్బులు కానీ, లేదా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుంటుందని తెలిపారు. కేటాయించి బడ్జెట్లో రూ.200 కోట్లు గుండె సంబంధ చికిత్సల కోసం, రూ.175 కోట్లు కిడ్నీ సంబంధిత సమస్యల చికిత్స కోసం ఖర్చు చేస్తున్నట్లు వారు వివరించారు. కిడ్నీ సమస్యలతో బాధపడే రోగుల కోసం ఆరోగ్యశ్రీలో కేటాయించిన ప్యాకేజీలు సరిపోవడంలేదని, దానికి సంబంధించిన విజ్ఞప్తులు వస్తున్నాయని ఆయన అన్నారు. వాటికి సంబంధించిన ప్యాకేజీలకు పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.


Tags:    

Similar News