ఒకే ఒక్కడు...వరంగల్-మంచిర్యాల్

కరోనా వైరస్ వ్యాపించకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే.

Update: 2020-03-26 14:32 GMT
old man walking from Warangal to mancherial

కరోనా వైరస్ వ్యాపించకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రవాణా వ్యవస్థ అంతా ఎక్కడికక్కడ స్థంబించిపోయింది. అంతే కాదు ప్రజలు కూడా ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాలని తెలిపారు. దీంతో ప్రజలు కూడా దాదాపుగా ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. కానీ చాలామంది పొట్టకూటి కోసం సొంత గ్రామాలను వదిలి నగరాలకు వెల్లిన వారు తిరిగి సొంత గ్రామాలకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు. సొంత ఊల్లకు వెళ్లలేక, చేసేందుకు పనిలేక ఆకలితో అలమటిస్తున్నారు. కాగా కొంత మంది మాత్రం ఇలా ఆకలికి చస్తూ బతకడం ఇష్టం లేక ఎదో ఒక లాగా తమ గ్రామాలకు వెల్లాలని నిర్ణయించుకున్నారు.

బస్సులు, రైళ్లు, ఆటోల ప్రయాణ సదుపాయాలు లేకపోయినా నడక దారిన బయల్దేరి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది కాలినడకన హైదరాబాద్ నుంచి తుంగుతుర్తి బయల్దేరి వెలుతుండగా వారికి ఆపద్బాంధవుడిలా మంత్రి కేటీఆర్ ఆదుకుని వాహనం సమకూర్చి వారిని సొంతూరికి పంచించారు. మరికొంత మంది కాలినడకన వెలుతుంటే వారి కష్టాలు చూడలేక ఓ ఎమ్మెల్యే వారి కోసం వాహనం తెప్పించి గమ్యానికి చేర్చారు. కానీ ఓ పెద్దాయన మూడు రోజుల నుంచి తన సొంత గ్రామానికి చేరుకోవడానికి కాలినడకన ప్రయాణిస్తున్నాఏ నాయకుడి కంట పడకపోవడంతో కాలి నడక కంటిన్యూ అవుతుంది. పూర్తివివరాల్లోకెళితే ఓ పెద్దాయన తన సొంత ఊరు మంచిర్యాల నుంచి వరంగల్ కు వెల్లి తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు.

వారం రోజుల నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ విధించడంతో రవాణా సౌకర్యం లేకపోవడంతో కాలినడకన మంచిర్యాలకు బయల్దేరారు. దాదాపుగా 105 కిలో మీటర్ల దూరం ఉన్నా వరంగల్ నుంచి రైలు పట్టాల వెంబడి నడక ప్రారంభించారు. మూడు రోజుల నుంచి అతను ప్రయాణం చేస్తున్నప్పటికీ ఆయన ఇంకా తన గమ్యాన్ని చేరుకోవలేక పోయాడు. ఈ మూడు రోజుల ప్రయాణంలో అతనికి ఆకలి వేస్తే ఏదో ఒక గ్రామంలో ఎవరైనా పెడితే తింటున్నాడు. లేదంటే తన వెంట తెచ్చుకున్న నీళ్లను తాగి ఖాళీ కడుపుతోనే ప్రయాణం కొనసాగిస్తున్నాడు. రాత్రి కాగానే ఏదో ఒక రైల్వే స్టేషన్లోనో విశ్రాంతి తీసుకుంటున్నాడు. మళ్లీ ఉదయాన్నే లేచి ప్రయాణం సాగిస్తున్నాడు. ఇప్పటి వరకూ సగం దూరం ప్రయాణించారు, మరో 50 కి.మీ. నడిస్తే తన ఊరు చేరుకుంటానని ఆయన చెప్పాడు. అంటే ఆ వృద్దడు గమ్యం చేరుకోవాలంటే ఇంకా రెండు, నుంచి మూడు రోజుల పాటు నడవాల్సిందే అన్న మాట..


Tags:    

Similar News