ఈనెల 22 తేదీన హైదరాబాద్ పరిసరాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సందర్శన
Hyderabad: ఈనెల 24 తేదీన అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన
ఈనెల 22 తేదీన హైదరాబాద్ పరిసరాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సందర్శన
Hyderabad: తెలంగాణలో పేదోడికి సొంతింటి కల నెరవేర్చేందుకు భారతీయ జనతాపార్టీ పోరాటబాట పట్టింది. ఉద్యమంలో తొలిసారిగా హైదరాబాద్ శివారులోని బాటసింగారం పండ్ల మార్కెట్ సమీపంలో డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణపనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాస్తవాలను ప్రజలముందు ఉంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించే ముందురోజు... ఛలో బాటసింగారం కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇవాళ కిషన్ రెడ్డితోపాటు, బీజేపీ రాష్ట్రనాయకులు బాటసింగారంలో సాగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శిస్తారు.
ఈనెల 22 తేదీన హైదరాబాద్ పరిసరాల్లోనూ చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్న వారితోనూ మాట్లాడే విధంగా కార్యక్రమాలను రూపొందించారు.
ఈనెల 24 తేదీన అన్ని జిల్లాల్లోనూ డబుల్ బడ్రూమ్ ఇళ్ల పురోగతిని ఆయా జిల్లా అధ్యక్షులు సామాజిక తనికీలు నిర్వహించి... వాస్తవాలను ప్రజలకు వివరించేవిధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈనెల 25 తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ధ డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై మహాధర్నా నిర్వహించాలని బిజెని నిర్ణయించింది.