తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా విజయ్‌సేన్‌రెడ్డి

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బీ విజయ్‌సేన్‌రెడ్డి పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

Update: 2020-04-21 04:38 GMT
vijaysen Reddy (File Photo)

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బీ విజయ్‌సేన్‌రెడ్డి పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు సోమవారం సమావేశమైన కొలీజియం ఆమోదముద్ర వేసింది. అంతే కాక ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయముర్తులుగా ముగ్గురు న్యాయవాదులు బీ కృష్ణమోహన్‌, కే సురేశ్‌రెడ్డి, కే లలితకుమారి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. కొలిజియం ఆమోద ముద్ర వేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కూడా లాంఛనంగా దీనికి ఆమోదం తెలిపి, నోటిఫికేషన్‌ జారీచేయాల్సి ఉంటుంది. హైకోర్టులోని న్యాయమూర్తుల సంఖ్య విజయ్‌సేన్‌రెడ్డి నియామకంతో 14కు పెరుగుతుంది.

న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నబీ బిజయ్ సేన్ రెడ్డి జస్టిస్‌ బీ సుభాషణ్‌రెడ్డి కుమారుడు. విజయ్‌సేన్‌రెడ్డి తండ్రి జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి గతంలో కేరళ హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా, ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా, మద్రాస్‌, ఉమ్మడి ఏపీలో మానవ హక్కుల కమిషన్‌ తొలి చైర్మన్‌గా పనిచేసి 2010లో రిటైర్‌అయ్యారు. అంతే కాక ఏపీ, తెలంగాణ రాష్ర్టాల లోకాయుక్తగా 2017 వరకు పనిచేశారు. 2019 మే 1న సుభాషణ్‌ రెడ్డి కన్నుమూశారు.

విజయర్ రెడ్డి విద్యాభ్యాసం..

1970లో జన్మించారు. హైదరాబాద్‌లోని పీఆర్‌ఆర్‌ లా కాలేజీలో న్యాయశాస్త్రం ఆయన పూర్తిచేశారు. ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా 19 94లోఎన్‌రోల్‌ అయ్యారు. ఈయనకు న్యాయవాదిగా 25 ఏండ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఆ అనుభవంలో ఆయన కొన్ని వేల సంఖ్యలో కేసులను వాదించి విజయం సాధించారు. ఈయన అనుభవంతో సుమారుగా 20 మంది జూనియర్లకు శిక్షణ ఇచ్చి వారిని మంచి లాయర్లుగా తీర్చిదిద్దారు. ముందుగా ఆయన ట్రిబ్యునళ్లలో, ట్రయల్‌ కోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. అనంతరం ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదిగా రాజ్యాంగ వ్యవహారాలు, ఆర్బిట్రేషన్‌, వ్యవహారాలు, వినియోగదారుల భూసేకరణ, క్రిమినల్‌, సివిల్‌, సర్వీస్‌, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌, పౌరసరఫరాలు వంటి అంశాల్లో నైపుణ్యం పొందారు.


Tags:    

Similar News