విశాఖ ఘటనపై స్పందించిన విజయశాంతి

విశాఖలో LG పాలిమర్స్ కంపెనీలో విష వాయువులు లీకైన సంగతి తెలిసిందే..

Update: 2020-05-07 13:46 GMT
VijayaShanthi (File Photo)

విశాఖలో LG పాలిమర్స్ కంపెనీలో విష వాయువులు లీకైన సంగతి తెలిసిందే.. విష వాయువు లీక్ అవ్వడంతో ఎక్కడికక్కడే అపస్మారక స్థితిలో పడిపోయారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటన పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రధాని మోడీ ఆరా తీశారు. ఇక ఇలాంటి సంఘటన జరుపుకోవడం బాధాకరం అని సినీ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. తాజాగా దీనిపైన సినీ నటి తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి స్పందించారు.

"కరోనా వైరస్ ఒకవైపు యావత్ ప్రపంచాన్నీ వణికిస్తున్న సమయంలో విశాఖపట్టణం, పరిసర గ్రామాల ప్రజలు విషవాయువు బారిన పడటం ఎంతో బాధ కలిగిస్తోంది. వృద్ధులు, మహిళలు, బాలలు, మూగజీవాలు ఈ విషవాయువు ప్రభావానికి లోనై తీవ్ర అనారోగ్యం పాలుకావడం... కొన్ని మరణాలు కూడా సంభవించడం వంటి పరిణామాలు తీరని వేదనను మిగిల్చాయి. బాధిత కుటుంబాలవారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గుండె ధైర్యంతో కరోనాపై పోరాడుతున్న విశాఖ పౌరులు, పరిసర గ్రామాలవారు ఈ విషవాయువు ప్రభావం నుంచి త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాను" అని విజయశాంతి పేర్కొన్నారు.




Tags:    

Similar News