Aadi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు తప్పిన ప్రమాదం
Aadi Srinivas: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంగళవారం ఉదయం పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.
Aadi Srinivas: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంగళవారం ఉదయం పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమ అగర్వాల్, కాంగ్రెస్ నేతలు, అధికారులతో కలిసి సందర్శించారు. గృహ సముదాయం వద్ద ఉన్న బేస్‌మెంట్ నిర్మాణాన్ని నిల్చొని పరిశీలిస్తున్న సమయంలో అది అకస్మాత్తుగా కుంగిపోయింది.
ఈ ఊహించని పరిణామంతో అక్కడి అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ నాయకులు చురుకుగా స్పందించి, కింద పడిపోతున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను పట్టుకోవడంతో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.