Coconut Tree in Telangana: రెండడుగుల కొబ్బరిచెట్టుకు 100కు పైగా కాయలు... తెలంగాణలో సాగు!

Coconut Tree in Telangana: రాష్ట్రంలో సాగునీటి వసతులు పెరుగుతున్నందున కొబ్బరి తోటలను విరివిగా సాగు చేయించాలని ప్రభుత్వం నిధులను కేటాయించింది.

Update: 2020-06-28 12:30 GMT

Variety Coconut Tree in Telangana: రాష్ట్రంలో సాగునీటి వసతులు పెరుగుతున్నందున కొబ్బరి తోటలను విరివిగా సాగు చేయించాలని ప్రభుత్వం నిధులను కేటాయించింది. రెండు నుంచి మూడు అడుగుల ఎత్తులోనే దిగుబడిని అందించే కల్పసూర్య, కేర సంకర, కల్పజ్యోతి ఇతర కొబ్బరి రకాలను తెలంగాణలో ప్రోత్సహించాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ నిర్ణయించింది. కల్పసూర్య వెరైటీతో 123 వరకూ, కల్పజ్యోతి నాటితే ఏడాదిలో 144 వరకూ కొబ్బరికాయలు వస్తాయని, కేర సంకరకైతే 130 వరకూ కాయలు వస్తాయని, చంద్ర సంకల, కల్ప సంవృద్ధి వెరైటీలు కూడా ఈ ప్రాంతంలో అనుకూలంగా ఉంటాయని అధికారులు తెలిపారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్న కొబ్బరి వంగడాలను కేరళలోని సీపీసీఆర్ఐ (కేంద్రీయ మొక్కలు, పంటల పరిశోధనా సంస్థ) సూచించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 1,131 ఎకరాల్లో మాత్రమే కొబ్బరి తోటలు ఉండగా, ఈ విస్తీర్ణాన్ని మరింతగా పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దీంతో ప్రభుత్వం 10 ఎకరాలకు సరిపోయే మొక్కలను కొనుగోలు చేస్తే, రూ. 7,500 రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఇక ఇప్పటికే రూ. 9.14 లక్షల రాయితీ నిధులను సీపీసీఆర్ఐ విడుదల చేసింది. పంటకు అవసరమైన తయారీకేంద్రం పెట్టుకోవడానికి అయ్యే వ్యయంలో రూ. 60 వేల రాయితీని కూడా ఇవ్వాలని సీపీసీఆర్ఐ నిర్ణయించింది.

ఇక ఈ కొబ్బరి పంటను వేసిన రైతులు తొలి మూడేండ్లలో అంతరపంటలుగా పూలతోటలు, కూరగాయలు సాగుచేయవచ్చని, వాటి ద్వారా ఆదాయం పొందవచ్చని ఉద్యావనశాఖ తెలిపింది. ఇక నాలుగో ఏటి నుంచి ఎకరానికి నికరంగా రూ. 80 వేల వరకూ ఆదాయం వస్తుందని అధికారులు అంటున్నారు. ఇక అప్పుడు కూడా అంతరపంటలుగా కోకో వంటివి సాగు చేసి మరో రూ. 60 వేలు పొందవచ్చని తెలిపారు. ఈ పంటలు ముఖ్యంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి తదితర జిల్లాల్లో కొబ్బరి సాగుకు నేలలు, వాతావరణం అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. 

Tags:    

Similar News