Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత

Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Update: 2025-04-12 03:59 GMT

Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత

Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రామయ్య ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి. 2017లో రామయ్యను కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. జీవితమంతా మొక్కలు నాటి పెంచిన రామయ్య.. వనజీవినే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. తన జీవితకాలంలో కోటికి పైగా మొక్కలునాటి రికార్డు సృష్టించారు. వనజీవి రామయ్యకు నలుగురు పిల్లలు.. వారిలో ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. వనజీవి రామయ్య భార్య పేరు జానకమ్మ.

రామయ్య మృతితో ప్రకృతి ప్రేమికులు శోక సంద్రంలో మునిగిపోయారు. రామయ్యను కడసారి చూడటానికి ప్రకృతి ప్రేమికులు, ప్రజలు రెడ్డిపల్లిలోని ఆయన ఇంటికి తరలి వస్తున్నారు. పలువురు రాజకీయ నేతలు రామయ్యకు నివాళి అర్పిస్తున్నారు.

Tags:    

Similar News