శ్రీ గోదా రంగనాయక స్వామి ఆలయంలో జనవరి 6న వైకుంఠ ఏకాదశి వేడుకలు
జిల్లా కేంద్రంలోని శ్రీపురం గ్రామంలో కొలువైన శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు జనవరి 6న నిర్వహిస్తున్నట్లు ఆలయధర్మకర్త టీవీ రంగాచార్యులు తెలిపారు.
నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలోని శ్రీపురం గ్రామంలో కొలువైన శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు జనవరి 6న నిర్వహిస్తున్నట్లు ఆలయధర్మకర్త టీవీ రంగాచార్యులు తెలిపారు. ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్సవాలకు సంబందించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త రంగాచార్యులు మాట్లాడుతూ... ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తున్నమని, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 6 ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుందన్నారు.
వైకుంఠ ఏకాదశి నాడు విశేష అర్చనలు అభిషేకాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జనవరి 14న గోదా కల్యాణం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి నిరంజన్, ఆలయ కమిటీ ఛైర్మన్ కే రామక్రిష్ణా రెడ్డి, వైస్ చైర్మన్ కే నర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఆలయ ఆర్చకులు వినోదాచార్యులు, సభ్యులు యోగానంద్ రెడ్డి, చంద్రనారాయణ, సలీం, వరదయ్య, గంధంప్రసాద్, మల్లికార్జున్, బంగారయ్య, గోపీనాథ్, ఆంజనేయులు, మారం మాధవ్ రెడ్డి .మారం విశ్వేశ్వర్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.