Covid19 Vaccination: 18 ఏళ్లు దాటిన వారికి నేటి నుంచి వ్యాక్సిన్

Covid19 Vaccination: హైదరాబాద్ లో నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Update: 2021-07-01 03:44 GMT

Vaccination Drive

Covid19 Vaccination: హైదరాబాద్  లో నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలో ఇప్పటి వరకు 35 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకాలు వేశారు. నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు వేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో జీహెచ్ఎంసీ సన్నద్ధమైంది. ఇందుకోసం నగర వ్యాప్తంగా 100 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

లబ్ధిదారులు తొలుత కొవిన్ యాప్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. అలా చేసుకున్న వారికే టీకాలు వేస్తామని పేర్కొన్నారు. వ్యాక్సిన్ పొందేందుకు అర్బన్ లోక‌ల్ బాడీస్‌, జీహెచ్ఎంసీ ప‌రిధిలో వారు కొవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యశాఖ జీహెచ్ఎంసీ ప‌రిధిలో 100 జీసీవీసీల‌ను, అర్బన్ లోక‌ల్ బాడీల్లో 204 జీసీవీసీల‌ను, గ్రామీణ ప్రాంతాల్లోని 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా టీకాలు వేయనున్నట్టు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. h

Tags:    

Similar News