Uttam Kumar Reddy: ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం

Uttam Kumar Reddy: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ లో శుక్రవారం ప్రమాదం జరిగింది.

Update: 2025-01-24 05:55 GMT

Uttam Kumar Reddy: ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం

Uttam Kumar Reddy: తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ లో శుక్రవారం ప్రమాదం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గరిడేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ వెళ్తున్న సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ లోని ఆరు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణీస్తున్న వాహన డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకే ఉన్న వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకున్నాయి.

జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనేందుకు మంత్రి వెళ్తున్న సమయంలో గరిడేపల్లి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను చూసి మంత్రి కారు ఆపాలని డ్రైవర్ కు సూచించారు. దీంతో అతను వెంటనే కారును నిలిపివేశారు. దీంతో మంత్రి కాన్వాయ్ లోని ఇతర వాహనాలు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News