Karimnagar: సర్పంచ్ రిజర్వేషన్ కోసం పెళ్లి.. ఓటరు లిస్టులోనే పేరు గల్లంతు

Karimnagar: కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్‌ గ్రామ సర్పంచి స్థానం ఎస్సీ మహిళలకు రిజర్వు అయింది.

Arun Chilukuri
Published on: 28 Nov 2025 2:28 PM IST
Karimnagar: సర్పంచ్ రిజర్వేషన్ కోసం పెళ్లి.. ఓటరు లిస్టులోనే పేరు గల్లంతు
X

Karimnagar: సర్పంచ్ రిజర్వేషన్ కోసం పెళ్లి.. ఓటరు లిస్టులోనే పేరు గల్లంతు

Karimnagar: కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్‌ గ్రామ సర్పంచి స్థానం ఎస్సీ మహిళలకు రిజర్వు అయింది. గ్రామంలో రాజకీయాలపై ఆసక్తి ఉండి.. అవివాహితుడైన ముచ్చే శంకర్‌ అనే వ్యక్తి ఈ రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు. నల్లగొండ జిల్లాకు చెందిన మహిళను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. ఆమె పేరు ఓటరు జాబితాలో చేర్చాలని భావించాడు. ఇంతలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో.. బుధవారం హడావుడిగా ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. కానీ దరఖాస్తు పెట్టడంలో ఆలస్యం కావడంతో ఆమె పేరు ఓటరు జాబితాలో నమోదు కాలేదు. దీంతో వారు అనుకున్నదొక్కటి... జరిగింది ఇంకోటీ.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story