మేఘాల కారణంగా గ్రహణాన్ని సంపూర్ణంగా చూడలేకపోయా: మోదీ

Update: 2019-12-26 06:02 GMT
మోదీ

ఉదయం 8 గంటల 8 నిమిషాలకు ప్రారంభమైన సూర్యగ్రహణం..11 గంటల11నిమిషాలకు వీడింది. మూలా నక్షత్రం ధనుస్సు రాశిలో ఈ సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ ఏడాదిలో ఇది మూడో సూర్యగ్రహణం. మూడు గంటలకుపైగా గ్రహణం కొనసాగింది. ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్‌, సౌదీ, సింగపూర్‌ దేశాల్లో సూర్యగ్రహణం కనిపించింది.

సూర్యగ్రహణాన్ని ప్రధాని మోదీ వీక్షించారు. ప్రస్తుతం కేరళలోని కోజికోడ్ లో ప్రధాని ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఎంతో మంది భారతీయుల మాదిరే తాను కూడా ఉత్సాహంగా గ్రహణాన్ని వీక్షించానని చెప్పారు. అయితే, మేఘాల కారణంగా గ్రహణాన్ని సంపూర్ణంగా చూడలేకపోయానని తెలిపారు. గ్రహణం గురించి నిపుణులను అడిగి తెలుసుకున్నానని చెప్పారు.


 

Tags:    

Similar News