మూడు నెలల చిన్నారిని చంపిన మేనమామ

-నల్గొండ జిల్లాలో దారుణం -మూడు నెలల చిన్నారిని చంపిన మేనమామ -పెద్దవూర మండలం చిన్నగూడెం గ్రామంలో ఘటన -తాగిన మైకంలో బండతో బాదిన ఉపేందర్‌ -చిన్నారి తల్లిదండ్రులను రూ.5వేలు అడిగిన ఉపేందర్‌ -డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో చిన్నారి హత్య

Update: 2019-09-27 04:34 GMT

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. సొంత మేనమామే ఆ చిన్నారి పాలిట కాలయుడైయ్యాడు. మూడు నెలల చిన్నారి అని కూడా చూడకుండా కంసుడిగా మారి చంపేశాడు. మూడు నెలల మేనకోడలిని బండకేసి బాదాడు. దీంతో చిన్నారి తలపగిలి అక్కడిక్కడే చనిపోయింది. ఈ ఘటన నల్లగొండ జిల్లోని పెద్దవూర మండలంలో చోటుచేసుకుంది. చిన్నగూడెం గ్రామానికి చెందిన ఉపేందర్‌ తాగుడికి బానిసైయ్యాడు. తన విలాసాల కోసం చిన్నారి తల్లిదండ్రులను 5వేల రూపాయలు అడిగాడు అయితే వారు అంత డబ్బు లేదని  చెప్పడంతో,ఈ కోపానికి గురై తాగిన మైకంలో ఈ ఘాతుకాని ఒడిగట్టాడు. పక్కనే నిద్రిస్తున్ మూడు నెల చిన్నారి ఝాన్సీని అతి కిరాతకంగా హతమార్చాడు. స్థానికులు ఇచ్చిన  సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Full View

Tags:    

Similar News