Nizamabad: నీటిగుంతలోపడి ఇద్దరు చిన్నారుల మృతి

Nizamabad: 15 రోజులు అవుతున్నా రక్షణ ఏర్పాట్లు చేయలేదని గ్రామస్తుల ఆరోపణ

Update: 2023-09-07 12:22 GMT

Nizamabad: నీటిగుంతలోపడి ఇద్దరు చిన్నారుల మృతి

Nizamabad: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ఇత్వార్‌పేట్‌లో విషాదం చేటు చేసుకుంది. నీటి గుంతలో పడి చరణ్, నాస్తిక్ అనే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వీడీసీ భవనం నిర్మాణం కోసం గుంతలు తవ్వగా...అందులో వరదనీరు చేరింది. ఆడుకోవడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు ఆ గుంతలో పడి మృత్యువాత పడ్డారు. గ్రామ కమిటీ భవనం కోసం భవనం కోసం గుంతలు తవ్వి 15 రోజులవుతున్నా..రక్షణ ఏర్పాట్లు చేయలేదని గ్రామస్తులు చెబుతున్నారు. రక్షణ ఏర్పాటు చేయకపోవడంతోనే చిన్నారులు మృతి చెందినట్టు స్థానికులు చెబుతున్నారు.

Tags:    

Similar News