Hyderabad: గణేశ్‌ నిమజ్జనంలో అపశ్రుతి.. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

Hyderabad: ప్రమాదవశాత్తు లారీ కిందపడి ఇద్దరు మృతి

Update: 2023-09-29 06:38 GMT

Hyderabad: గణేశ్‌ నిమజ్జనంలో అపశ్రుతి.. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

Hyderabad: ‍‍హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకల్లో విషాదం జరిగింది. వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సంజీవయ్య పార్క్ దగ్గర మైనర్ బాలుడు గణేశ్ విగ్రహాన్ని తీసుకెళ్తున్న లారీ కింద పడి ప్రాణాలు విడిచాడు. కిషన్‌బాగ్‌కు చెందిన ప్రణీత్‌కుమార్‌ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ వెంట వెళ్లాడు. గణేశ్‌ను తరలిస్తుండగా ప్రమాదవశాత్తు లారీ టైర్ కిందపడి మృతి చెందాడు.

గణేశ్ నిమజ్జన సంబురం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఫ్యామిలీతో కలిసి నిమజ్జన వేడుకలకు హాజరై తిరిగి వెళ్తుండగా ఓ చిన్నారి మృతి చెందాడు. ఓ వ్యక్తి కుటుంబసభ్యులతోకలిసి బైక్‌తో వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాబు కిందపడిపోయాడు. విగ్రహాలను తరలించేందుకు ఉపయోగించే భారీ తస్కర్ వాహనం చిన్నారి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Tags:    

Similar News