రెండో రోజుకు చేరుకున్న పసుపు రైతుల ఆత్మగౌరవ యాత్ర

Update: 2019-12-17 05:10 GMT

కొన్ని రోజులుగా నిజామాబాద్ పసుపు రైతులు పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. అయినప్పటికీ ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల్లో గెలిచిన తరువాత పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపిన ఎంపీ అరవింద్ కూడా తమ సమస్యలను గురించి పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. ఇదే నేపధ‌్యంలో రైతులు నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

ఇదే క్రమంలో పసుపు రైతుల ఆత్మగౌరవ యాత్ర రెండో రోజుకు చేరుకుంది. ఇవాళ మెండోరా, బుస్సా‌పూర్, ముఫ్కాల్, కొత్తపల్లి మండలాల్లో పాదయాత్ర సాగనుంది. పాదయాత్రలో రైతు జేఏసీ ఐదు తీర్మానాలు చేసింది. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, మద్దతు ధర 15 వేల రూపాయలుగా ప్రకటించాలని, పసుపు బోర్డుపై శాసన సభలో తీర్మానం చేయాలని కోరుతున్నారు. అలాగే పసుపు సమస్యపై తెలంగాణ ప్రజా ప్రతినిధులపై ఒత్తడి తేవాలని చూస్తున్నారు. మార్కెట్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.




Tags:    

Similar News