కాసేపట్లో జేఏసీ నేతలతో ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ

-కాసేపట్లో జేఏసీ నేతలతో ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ -సమ్మెకు జేఏసీ పిలుపు నేపథ్యంలో చర్చలు -11గంటలకు సమావేశం కానున్న ఐఏఎస్‌ల త్రిసభ్య కమిటీ -సమ్మెపై వెనక్కి తగ్గేది లేదంటున్న ఆర్టీసీ జేఏసీ నేతలు

Update: 2019-10-04 04:39 GMT

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ నేతలు పిలువునిచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారుల్లో ఆందోళన మొదలైంది. మరోసారి జేఏసీ నేతలతో చర్చలు జరిపేందుకు రెడీ అయ్యారు. 11గంటలకు ఐఏఎస్‌ల త్రిసభ్య కమిటీ జేఏసీ నేతలతో చర్చలు జరపనుంది. తాము ఇప్పటికే ప్రభుత్వం ముందు ఉంచిన 26 డిమాండ్లకు సానుకూలంగా ఉంటేనే సమ్మె విరమించుకుంటామని, లేకుంటే వెనక్కి తగ్గేది లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మంగళవారం ప్రభుత్వ ఆర్టీసీ కార్మికులతో చరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు లేకపోవడంతో కార్మిక సంఘాలు సమ్మేకు మొగ్గు చూపాయి. దసరా పండుగ ముందు సమ్మె నిలిపివేయాలని , ఐఏఎస్ అధికారి సోమేష్‎ ఆర్టీసీ కార్మికులను కోరారు.  ఈ నేపథ్యంలో మరోసారి జేఏసీ నేతలతో చర్చలు జరిపేందుకు రెడీ అయ్యారు.

Tags:    

Similar News