TGSRTC: ఆర్టీసీ సంచలన నిర్ణయం.. ఇక బస్ డ్రైవర్లు అలా చేస్తే ఇంటికే
TGSRTC: ఇటీవల చోటుచేసుకున్నబస్సు ప్రమాదాలనేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
TGSRTC: ఇటీవల చోటుచేసుకున్నబస్సు ప్రమాదాలనేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ఆర్టీసీ డ్రైవర్లు సెల్‌ఫోన్ మాట్లాడుతూ... డ్రైవింగ్ చేయనీవద్దనే ఆంక్షలను అమలుచేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా హనుమకొండ జిల్లా పరకాల డిపోలో ఆర్టీసీ డ్రైవర్లు డ్యూటీకి వెళ్లే ముందుగానే... సెల్ ఫోన్లను సెక్యూరిటీకి అప్పగించే విధానం అమలుచేస్తున్నారు. డ్యూటీ ముగించుకున్న తర్వాత.. సెక్యూరిటీనుంచి ఫోన్ తీసుకునే విధంగా ఆర్టీసీ ఉత్తర్వులు జారీచేసింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేర్చాలనే ఉద్ధేశంతో ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. డ్రైవర్ల నిర్లక్ష్యంతో ఎక్కడా ప్రమాదం జరిగేందుకు వీల్లేకుండా చేయాలని ఆర్టీసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణలోని 11 రీజియన్లనుంచి ఒక్కో డిపోను ఎంపిక చేసి సెల్ ఫోన్ డ్రైవింగ్ నిషేధ ప్రక్రియను పైలట్ ప్రాజెక్టుగా అమలుచేసిన తర్వాత... రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లోనూ అమలు చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో డ్రైవర్ల ఇళ్లనుంచి సమాచారం అందివ్వాలనుకున్నపుడు.. ప్రతిడిపోలోనూ సెక్యూరిటీ విభాగానికి ఫోన్ చేసి సమాచారం అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. సంబంధిత కండక్టర్‌ను సంప్రదించి, డ్రైవర్‌కు సమాచారం అందించే విధంగా ఆర్టీసీ అధికార యంత్రాంగం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది.