TSPSC : విడుదలైన గ్రూప్ II మార్కుల జాబితా

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) సోమవారం గ్రూప్ II మార్కుల జాబితాను తన అధికారిక సైట్ లో పొందుపరిచింది.

Update: 2019-11-04 11:15 GMT

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) సోమవారం గ్రూప్ II మార్కుల జాబితాను తన అధికారిక సైట్ tspsc.gov.in లో  పొందుపరిచింది.  గ్రూప్ II ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థులు ఈ జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలని తెలిపింది.

"గ్రూప్- II సర్వీసెస్ పరిధిలోకి వచ్చే పోస్టుల నియామకానికి జూలై 1, 2019 నుండి ఆగస్టు 27, 2019 వరకు ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల మార్కుల జాబితాను వెలువరించింది. వారికి సంబంధించిన నోటిఫికేషన్ నెం. 20/2015 & 17/2016 కమిషన్ వెబ్‌సైట్, " నోటిఫికేషన్ తెలిపింది. 1032 ఖాళీలకుగాను 2064 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే, ఇంటర్వ్యూలకు 2028 మంది అభ్యర్థులు హాజరయ్యారు.


Tags:    

Similar News