బ్రేకింగ్ న్యూస్ : ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు సీరియస్.. ప్రజలు తిరగబడితే ఎవరూ ఆపలేరు

Update: 2019-10-18 09:55 GMT

ఆర్టీసీ కొత్త ఎండీని ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు రెండు వారాలుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రభుత్వం తరుపు న్యాయవాది అడిగింది. సమర్ధవంతమైన ఇన్‌చార్జీ ఉన్నాడన్న ప్రభుత్వం కొత్త ఎండీ నియామకం వల్ల సమస్య పరిష్కారం కాదని కోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన కోర్టు సమర్ధవంతమైన ఇన్‌చార్జీ ఉంటే, సమస్య ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నించింది.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక వ్యాఖలు చేసింది. ఆర్టీసీ ఆందోళనలను ప్రభుత్వం ఎందుకు అపలేకపోయిందన్న కోర్టు ప్రజలు శక్తివంతులని వాళ్లు తిరగబడితే, ఆపడం సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తండ్రి పాత్రను పోషించాలని ప్రజలు ఇబ్బందిపడకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని అడిగింది.

ప్రజలే ప్రజాస్వామ్యం ప్రజలకంటే ఎవరు గొప్పకాదన్న హైకోర్టు పిలిప్పిన్స్ రాజు విషయంలో ప్రజల తిరుగుబాటు ఘటను గుర్తు చేసింది. స్కూల్స్ ఓపెనింగ్ తో పాటు రాష్ట్ర బంద్ పై మీ స్పందన ఏమిటని ప్రభుత్వాన్ని అడిగింది. శాంతియుతంగా బంద్ చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 

Tags:    

Similar News