కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ లో సత్తా చాటిన టీఆర్ఎస్.. మేయర్ అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు..

Update: 2020-01-27 12:10 GMT

కరీంనగర్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ను అధికార టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 60 డివిజన్లలో టీఆర్ఎస్ కు చెందిన 34 మంది అభ్యర్థులు కార్పొరేటర్లుగా గెలుపొందారు. బీజేపీ 12, ఎంఐఎం 6 స్థానాల్లో విజయం సాధించాయి. ఏడు స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఖాతా తెరవలేదు.

కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఈ నెల24న జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇవాల ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం 60 డివిజన్లలో టీఆర్ఎస్ 34 గెలుచుకుంది. బీజేపీ 12 డివిజన్లు, ఎంఐఎం 6 డివిజన్లు కైవసం చేసుకోగా మరో ఏడు స్థానాల్లో ఇతరులు గెలుపొందారు.

టీఆర్‌ఎస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత సాధించినా మేయర్ అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు మొదలయ్యాయి. మాజీ మేయర్ రవీందర్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లు మేయర్ పదవి కోసం పోటీ పడుతున్నారు. కరీంనగర్‌లో పార్లమెంట్ ఎన్నికల తరహాలో బీజేపీ హవా కొనసాగుతుందని భావించినా మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ చతికిలపడింది.

Tags:    

Similar News