టీఆర్ఎస్ నాయకుడు రమణ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
స్థానిక 6వ డివిజన్ లక్మిపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు గొల్లపెళ్లి రమణ అనారోగ్యంతో మరణించారు.
వరంగల్: స్థానిక 6వ డివిజన్ లక్మిపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు గొల్లపెళ్లి రమణ అనారోగ్యంతో మరణించారు. వారి భౌతికాయానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం వారి కుటుంభం సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి కుటుంబాన్ని,ఐ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే తో పాటు కార్పొరేటర్ చింతల యాదగిరి, డివిజన్ నాయకులు చంద్రమౌళి, సదానందం, షకీల్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.