సీఎం కేసీఆర్‌ను కలిసిన టీఆర్ఎస్ కార్పొరేటర్లు

* మేయర్, డిప్యూటీ మేయర్‌ను అభినందించిన సీఎం * అభివృద్ధి విషయంలో రాజీపడకూడదని సూచన * ప్రజల సమస్యల పై దృష్టి పెట్టాలి- సీఎం కేసీఆర్

Update: 2021-02-12 04:46 GMT

TRS corporators

మేయర్ ఎన్నిక అనంతరం హైదరాబాద్ టీఆర్ఎస్ కార్పొరేటర్లు సీఎం కేసీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. కొత్తగా ఎన్నికైన జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, టిఆర్ఎస్ కార్పొరేటర్లను అభినందించారు సీఎం. హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో రాజీపడకుండా ప్రజల సమస్యల పై దృష్టి పెట్టాలని సూచించారు. విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతుల వాళ్ళు నివాసించే హైదరాబాద్ నగర వైభవం మరింత పెంచేలా కృషి చేయాలన్నారు. పదవులు ఉన్న వారు సంయమనంతో, సహనంతో ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో సహజత్వం కోల్పోవద్దని సూచించారు.

కార్పొరేటర్లతో మీటింగ్ సందర్భంగా గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది అనే గోరటి వెంకన్న పాటను ప్రస్తావించారు సీఎం కేసీఆర్. బస్తీల్లో ఉండే పేదలకు కష్టాలు, గోసలున్నాయి. వాటిని అర్థం చేసుకోని మేయర్, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించాలన్నారు. వారి సమస్యలపై దృష్టి పెట్టి తీర్చాలని సూచించారు.

Tags:    

Similar News