Indra Sena Reddy: చిట్టగాన్ పోర్ట్ ప్రారంభం అయితే గేట్‌వేగా త్రిపుర మారుతుంది
Indra Sena Reddy: అగర్తల ఎడ్యుకేషన్, మెడికల్ హబ్‌గా నిలుస్తోంది
Indra Sena Reddy: చిట్టగాన్ పోర్ట్ ప్రారంభం అయితే గేట్‌వేగా త్రిపుర మారుతుంది
Indra Sena Reddy: ఆసియా దేశాలకు భూమార్గం ద్వారా వెళ్లే ప్రాంతం త్రిపుర అని ఆ రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. జగిత్యాలకు వెళ్తుండగా మార్గమధ్యలో సిద్దిపేటలో బీజేపీ నాయకులు రామచంద్రారెడ్డి ఇంటికి ఆయన వెళ్లారు. త్రిపుర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఇంద్రసేనా రెడ్డి వివరించారు. చిట్టగాన్ పోర్ట్ ప్రారంభం అయితే ఇది గేట్ వేగా నిలుస్తోందన్నారు. త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల ఎడ్యుకేషన్, మెడికల్ హబ్‌గా నిలుస్తోందన్నారు. త్రిపుర రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేస్తుండటం సంతోషంగా ఉందన్నారు.