పెళ్లింట విషాదం.. డ్యాన్స్‌ చేస్తూ అక్కడికక్కడే మృతి చెందిన వధువు తండ్రి

Update: 2019-12-14 05:48 GMT
డ్యాన్స్‌

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలోని అంబేద్కర్‌నగర్‌లో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. కూతురు వివాహం అనంతరం బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ వధువు తండ్రి దాసు కుప్పకూలిపోయాడు. దీంతో అప్పటి వరకు పెళ్లిసందడితో ఉన్న ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.

హుజరాబాద్‌లో ఆర్టీఏ ఏజెంట్‌గా పని చేస్తున్న దాసుకు ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురు వీణ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతో ఉత్సాహంగా బిడ్డ పెళ్లి చేసిన దాసు బంధువులతో కలిసి డ్యాన్స్‌ చేశాడు. డ్యాన్స్‌ చేస్తూనే గుండెపోటు వచ్చి దాసు అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. దీంతో అప్పటి దాకా ఎంతో కోలాహలంగా ఉన్న ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఆనందోత్సహాల స్థానంలో రోదనలు మిన్నంటాయి.

Tags:    

Similar News