ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలి

జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణలో భాగంగా ట్రాఫిక్‌ పోలీసులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు.

S. Srikanth
Published on: 24 Nov 2019 12:31 PM IST
ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలి
X
ఎస్పీ ఎన్. కోటిరెడ్డి,ట్రాఫిక్‌ ఎస్సై రవీందర్‌, మరియు పోలీసు సిబ్బంది

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ సమస్యను నివారించడంలో భాగంగా నూతన రహదారుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఎస్పీ ఎన్. కోటిరెడ్డి తెలిపారు.జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణలో భాగంగా ట్రాఫిక్‌ పోలీసులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు.

చిన్న చిన్న వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ నియంత్రణపై సూచనలు చేశారు. నిబంధనలు పాటించని వారికి ఈ చలానా ద్వారా జరిమానా విధించాలన్నారు. స్పీడ్‌ గన్స్‌, బాడీ వార్న్‌ కెమెరాలు ఉపయోగిస్తూ ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించాలన్నారు. ట్రాఫిక్‌ ఎస్సై రవీందర్‌, మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story