Hyderabad: ఇనుప చువ్వల్లో బిక్కుబిక్కుమంటూ పిల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్
Hyderabad: రెండ్రోజుల క్రితం ఇనుప చువ్వలలో చిక్కుకున్న పిల్లి
Hyderabad: ఇనుప చువ్వల్లో బిక్కుబిక్కుమంటూ పిల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్
Hyderabad: హైదరాబాద్‌లోని ఉప్పల్ రింగ్ రోడ్డులో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ పిల్లిని రెస్క్యూ చేశాడు. కేవీ స్కూల్ సమీపంలోని కారిడార్ నిర్మాణానికి ఏర్పాటు చేసిన పిల్లర్స్ ఇనుప చువ్వలలో పిల్లి చిక్కుకుపోయింది. అయితే ఆ పిల్లి గత రెండ్రోజుల నుంచి అక్కడే ఉండడం స్థానికులు గమనించారు. దీంతో ఆ ప్రాంతంలోనే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పాండు పిల్లిని కాపాడాడు. ప్రాణాలకు తెగించి పిల్లిని రెస్క్యూ చేసిన కానిస్టేబుల్‌ను స్థానికులు అభినందించారు.