ధాన్యం లోడుతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా
మిర్యాలగూడ రోడ్ శ్రీ మాత సాయిబాబా రైస్ మిల్లు ఎదురుగా రోడ్ పై అదుపు తప్పి బోల్తా కొట్టిన ట్రాక్టర్.
హుజూర్ నగర్: మిర్యాలగూడ రోడ్ శ్రీ మాత సాయిబాబా రైస్ మిల్లు ఎదురుగా రోడ్ పై అదుపు తప్పి బోల్తా కొట్టిన ట్రాక్టర్. ధాన్యం బస్తాలతో వెళుతున్న ట్రాక్టర్ రోడ్డు బాగా లేక పోవడంతో గుంతలో పడి ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. వరి ధాన్యం బస్తాలు ఒక్కసారిగా ట్రాక్టర్ నుండి రోడ్డుపై పడ్డాయి.
ఆ సమయం లో ట్రాక్టర్ పక్కన ఎవరు లేక పోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే అధికారులు స్పందించి గుంతలు పడి ప్రయాణానికి ఇబ్బందికరంగా ఉన్న రోడ్డును మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.