టమాట ధర అగ్గువ..కిలో ఎంతంటే..

మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్. కొద్ది రోజుల నుండి బంగారం, వెండితో పాటు చికెన్ ధరలు ఆకాశాన్ని అంటి నట్టు.. టమాట ధర కూడా చుక్కలు చూపించింది.

Update: 2019-08-27 02:58 GMT

మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్. కొద్ది రోజుల నుండి బంగారం, వెండితో పాటు చికెన్ ధరలు ఆకాశాన్ని అంటి నట్టు.. టమాట ధర కూడా చుక్కలు చూపించింది. టమాట ధర ఎప్పుడు ఎప్పుడేప్పుడు దిగుతుందా అని ఎదురుచూసిన వారికి ఎట్టకేలకు టమాట ధర దిగి వచ్చింది. మొన్నటి వరకు మహానగరంలో టమాట ధర రూ. 50 నుండి రూ.60 రూపాయల వరకు పలికింది. కాగా, గత రెండు రోజులుగా హైదరాబాద్‌నగర మార్కెట్‌లకు భారీ ఎత్తున టమాటా దిగుమతులు పెరగడంతో ధరలు దిగి వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో టమాట ధర రూ.10 రూపాయలకే లభిస్తోంది. ఇక రిటైల్ వ్యాపారులు మాత్రం కిలో 15 చొప్పున అమ్ముతున్నట్లు తెలుస్తోంది.

నగరంలోని ప్రధాన కూరగాయల మార్కెట్‌లయిన గుడిమల్కాపూర్‌, ఎల్‌బినగర్‌, బోయిన్‌పల్లి, సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌తోపాటు, గ్రేటర్‌పరిధిలోని 11 రైతుబజార్లకూ భారీ ఎత్తున టమాటా దిగుమతి అవుతుంది. అయితే గతవారం పది రోజుల క్రితం మార్కెట్‌కు 40 నుంచి 50లారీల మేరకు టమాటాలు దిగుమతి అయ్యాయి. మొత్తానికి టమాట ధర అగ్గువా కావడంతో సామాన్యులు ఊపిరిపీల్చుకున్నారు. 

Tags:    

Similar News